
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేశారు. మ్యాజిక్ రింగ్ ఫీచర్, ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ వంటి అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెట్‌ను అందించారు. 12ఎన్‌ఎం మీడియాటెక్ హీలియో జీ36 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇక ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. మార్చి 9వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్‌లో సేల్ ప్రారంభం కానుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో ర్యామ్‌ను వర్చువల్‌గా 4జీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఫోన్ లభించనుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఫోన్‌పై రూ. వెయ్యి డిస్కౌంట్ అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తేఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించనున్నారు.