Infinix Zero 5g: భారత మార్కెట్లోకి ఇన్‌ఫిక్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. రూ. 20వేలలో అదిరిపోయే ఫీచర్లు..

|

Feb 14, 2022 | 7:10 PM

Infinix Zero 5g: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఇన్‌ఫిక్స్‌ భారత మార్కెట్లోకి తొలి 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ఈ 5జీ ఫోన్‌లో ఫీచర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి..

1 / 5
భారత్‌లో మరికొన్ని రోజుల్లో 5జీ సేవలు లాంచ్‌ కానున్న నేపథ్యంలో టెక్‌ మార్కెట్లో 5జీ మొబైల్స్‌ సందడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌ఫిక్స్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఇన్‌ఫిక్స్‌ జీరో పేరుతో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

2 / 5
ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 5జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999గా ఉంది. ఫిబ్రవరి 18 నుంచి ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

3 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెట్జ్ టచ్ సాంప్లింగ్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌‌ ఈ డిస్‌ప్లే సొంతం. ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమంసిటీ 900 5జీ ప్రాసెసర్‌తో నడుస్తుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో ఇందులో 48 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

5 / 5
డ్యూయల్‌ స్పీకర్లు ఈ ఫోన్‌ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఇందులో 33 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.