Huawei P50 Pocket: హువావే నుంచి ఫోల్డబుల్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర రూ.. లక్షకు పైమాటే..

|

Dec 25, 2021 | 2:53 PM

Huawei P50 Pocket: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తున్న వేళ తాజాగా చైనాకు చెందిన హువావే కూడా ఫోల్డబుల్‌ ఫోన్‌ను విడుదల చేసింది. హువావే పీ50 పాకెట్ పేరుతో వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్‌ ఫీచర్లను ఓసారి చూడండి..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ హువావే తాజాగా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హువావే పీ 50 పాకెట్‌ పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్ తొలుత చైనా మార్కెట్లో, ఆ ఇతర దేశాల్లో విడుదల కానుంది.

2 / 5
వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్,  ప్రీమియం ఎడిషన్‌లో 12జీబీ + 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌ ధర రూ. 1.06 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

3 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.9-అంగుళాల ప్రైమరీ OLED డిస్‌ప్లేను అందించారు. అలాగే ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో 40 మెగాపిక్సెల్‌+13 మెగాపిక్సెల్‌+32 మెగాపిక్సెల్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 1.7 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
ఇక ఇందులో 40w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.