
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ హానర్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. హానర్ 90 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి రాగా త్వరలోనే భారత్‌లో లాంచ్ కానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ క్వాడ్-కర్డ్వ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. 1,200 x 2,664 పిక్సెల్‌లు ఈ స్క్రీన్ ప్రత్యేకత.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్‌ను అందించారు. ఇక ఇందులో 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 200 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ధర విషయానికొస్తే ఇప్పటి వరకు ఈ ఫోన్ ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే లీక్ అయిన వివరాల ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 29,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.