
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. హానర్ మ్యాజిక్ వీ2 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తొంది. ప్రపంచంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌గా హానర్ మ్యాజిక్ వీ2 గుర్తింపు సంపాదించుకుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 9.9mmతో రూపొందించారు. హానర్ మ్యాజిక్ వీ2ను గతేడాది చైనాలో మార్కెట్లో తీసుకురాగా ప్రస్తుతం యూకేతో పాటు యూపర్‌లోని పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారన్నదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇక హానర్ మ్యాజిక్ వీ2 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో వినూత్నమైన డిస్‌ప్లే టెక్నాలజీని అందించారు. ఈ ఫోన్‌లో బయట 6.43-అంగుళాల 120Hz LTPO కవర్ స్క్రీన్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో, 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఫోన్‌ను తెరచినప్పుడు 7.92 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ ప్యానెల్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ 16MP సెల్ఫీ షూటర్స్ ఉన్నాయి. వెనుక భాగంలో 50MP మెయిన్ షూటర్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 2.5x 20MP టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. హానర్ మ్యాజిక్ వీ2లో 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. అలాగే ఇందులో 5,000ఎమ్‌ఏహెచ్ డ్యూయల్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. యూరోప్ లో దీని ధర 1,699.99 యూరోలుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. లక్షన్నర.