
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌ఎమ్‌డీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హెచ్‌ఎమ్‌డీ ఫ్యూజన్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను నవంబర్ 25వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలోనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 720 x 1612 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెకసర్‌ను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. ఇంటర్నల్ స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఇక హెచ్‌ఎమ్‌డీ ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ కెసాపిటీ గల బ్యాటరీని అందించనున్నారు. దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెంట్ కోసం ఇందులో ఐపీ52 రేటింగ్‌ను అందించనున్నారు. ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.