Jio vs BSNL: 28 రోజుల వ్యాలిడితో వచ్చే బెస్ట్ ప్లాన్లు ఇవే.. జియో, బీఎస్ఎన్ఎల్ మధ్యే గట్టి పోటీ..

|

Jul 28, 2024 | 4:54 PM

టెలికాం రంగంలో గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంతకాలం ఈ రంగంలో ఏకచత్రాధిపత్యం ప్రదర్శించిన ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారతీయం సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) నుంచి ప్రైవేటు ఆపరేటర్లకు గట్టిపోటీ వస్తోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభించడంతో దేశంలోని ప్రముఖ ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వంటి సంస్థలకు చెమటలు పడుతున్నాయి. పైగా ఇటీవల ప్రైవేటు ఆపరేటర్లు తమ ప్లాన్ల ట్యారిఫ్ లను పెంచడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున బీఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అవుతున్నారు. దీంతో రిలయన్స్ జియో లెంపలేసుకొని మళ్లీ ట్యారిఫ్ రేట్లను తగ్గించింది. ఈ క్రమంలో రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో రెండింటిలోనూ ఉన్న 28 రోజుల ప్రీ పెయిడ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
రెండింటిలో ఏది బెస్ట్.. రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ పోటాపోటీగా రీచార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. వాటిలో టాక్ టైం, డేటా, మెసేజెస్ వంటి ప్రయోజనాలతో పాటు అదనపు కాంప్లిమెంటరీలు కూడా ఉన్నాయి. అవి నెలవారీ లేదా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి. వాటిల్లో జియో నుంచి రూ. 348, బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 108, రూ. 107 ప్లాన్లు ఉన్నాయి.

2 / 5
రిలయన్స్ జియో రూ. 349 ప్రీ పెయిడ్ ప్లాన్.. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతి రోజూ 2 జీబీ 5జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అంతేకాక ఈ ప్లాన్ తీసుకోవడం ద్వారా జియో సినిమా యాప్ నకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

3 / 5
జియో యాడ్ ఆన్ ప్లాన్లు.. 28 రోజుల ప్లాన్లతో పాటు జియో కొత్త యాడ్ ఆన్ ప్లాన్లను అందిస్తోంది. ఇవి అన్ లిమిటెడ్ ప్లాన్లు. రూ. 151, రూ. 101, రూ. 51 ట్యారిఫ్ తో ఈ ప్లాన్లు ఉన్నాయి. రూ. 151 రీచార్జ్ తో 9జీబీ, రూ. 101 రీచార్జ్ తో 6జీబీ, రూ. 51 రీచార్జ్ తో 3జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఇది మీ ప్రస్తుత బేస్ యాక్టివ్ ప్లాన్ పరిధిలో అందిస్తుంది. బేస్ ప్లాన్ యాక్టివ్ గా ఉన్నంత కాలం ఈ యాడ్ ఆన్ ప్లాన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. బేస్ ప్లాన్ రోజువారీ డేటా ముగిసిన తర్వాత ఈ డేటా వినియోగంలోకి వస్తుంది.

4 / 5
Bsnl

Bsnl

5 / 5
ధరలు పెరిగాయ్.. జూన్ 27న టారిఫ్‌లను పెంచిన రిలయన్స్ జియో అడుగుజాడల్లోనే మరో టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ జూలై 3 నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచింది. దీంతో చాలా మంది బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లు బీఎస్ఎన్ఎల్ వైపు చూడటం మొదలు పెట్టారు. దీని తోడు బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలు ప్రారంభించడం వినియోగదారులకు మేలు చేసినట్లు అయ్యింది.