శామ్సంగ్ గేలాక్సీ ఎఫ్04(Samsung Galaxy F04).. మార్కెట్లో అతి తక్కువ ధరలో లభించే బెస్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. దీని ధర రూ. 9,249. దీనిలో 6.5 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్.
ఒప్పో ఏ17కే(Oppo A17k).. ఇది కూడా మార్కెట్లో తక్కువ ధరకే దొరికే బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఫోన్. దీని ధర రూ. 9,499. దీనిలో 6.56 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తోంది. దీనిలో వెనుక వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.
మోటోరోలా జీ31(Motorola G31)..ఇది తక్కువ ధరలో లభించే బెస్ట్ ఫోన్లలో ఒకటి. దీని ధర రూ. 9,499. దీనిలో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్. అలాగే దీనిలో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉంటుంది.
రెడ్ మీ 10(Redmi 10).. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,999. దీనిలో 6.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.
రియల్ మీ సీ33(Realme C33).. ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా రూ. 9,999. దీనిలో 6.5 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. వెనుకవైపు ఏకంగా 50ఎంపీ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ ఉంటుంది.
వివో వై 15ఎస్(Vivo Y15s).. అనువైన బడ్జెట్ లో దొరికే ఈ ఫోన్ లో మంచి అడ్వాన్స్ డ్ ఫీచర్లున్నాయి. దీని ధర రూ. 9,499. దీనిలో 6.51 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో(Infinix Hot 12 Pro).. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,499. దీని డిస్ ప్లే 6.6 అంగుళాలు ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000ఎంఏహెచ్ ఉంటుంది. యూనిసోక్ టీ616 ప్రాసెసర్ ఉంటుంది.