
కరోనా కారణంగా వీడియో కాల్స్‌కు బాగా ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఆఫీస్ మీటింగ్‌లకు, ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం గూగుల్ మీట్ వినియోగం బాగా పెరిగింది.

అయితే ఈ సేవలను వినియోగించుకునే సమయంలో పూర్ కనెక్షన్ కారణంగా వీడియో కాల్స్‌లో అంతరాయం కలుగుతుంది.

కొన్ని సందర్భాల్లో పూర్ కనెక్షన్ కారణంగా ముఖ్యమైన సమావేశాల్లో ఉన్నప్పడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

దీనికి చెక్ పెట్టడానికే గూగుల్ మీట్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా వీడియో కాల్స్ మాట్లాడుకొవచ్చు.

మీటింగ్ మధ్యలో పూర్ కనెక్షన్ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్ ఆప్షన్ మెనూ బబుల్ కూడా వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ట్రబుల్‌షూట్, హెల్ప్ ఆప్షన్ వస్తుంది.

ఈ ఆప్షన్‌ను ఎంచుకోగానే పూర్ కనెక్షన్ సమస్యను పరిష్కరించే రికమండేషన్స్ అక్కడ కనిపిస్తాయి. వాటిని ఫాలో అవడం ద్వారా పూర్ కనెక్షన్ సమస్యను ఎదుర్కొవచ్చని గూగుల్ చెబుతోంది.