
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కారు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ ఫోన్‌లో కారు క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో కారు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చు.

భారత్‌తో పాటు ఐదే దేశాల్లో గూగుల్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పిక్సెల్ ఫోన్‌లో తీసుకొచ్చిన కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ సహాయంతో ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని.. ఆండ్రాయిడ్ ఎక్స్‌పర్ట్ మిషాల్ రెహ్మాన్ పేర్కొన్నారు.

కారు ప్రమాదానికి గురైనప్పుడు.. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమెటిక్‌గా ఎమర్జెన్సీ అలర్ట్ 112 హెల్ప్‌లైన్ నెంబర్ కాల్ వెళ్తుంది. అలాగే వెంటనే.. లొకేషన్ కూడా షేర్ అవుతుంది. మీరు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని ఇతరులకు తెలియజేస్తుంది.

గూగుల్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను.. భారత్, ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లలో విడుదల చేయగా, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సెల్ ఫోన్స్‌లో పర్సనల్ సేఫ్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, అనంతరం యాప్‌లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం లొకేషన్, మైక్రోఫోన్, ఫిజికల్ యాక్టివిటీ పర్మిషన్ వంటి ఆప్షన్స్‌కు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది.