Shiva Prajapati |
Jun 04, 2021 | 12:17 AM
కరోనా ఎఫెక్ట్‌తో వ్యక్తులు నేరుగా కలవడం మానేశారు. ఫలితంగా వీడియో కాల్స్ వినియోగం బాగా పెరిగింది.
ఉద్యోగుల నుంచి విద్యార్థులకూ అందరూ వీడియో కాల్స్‌పై ఆధారపడుతూ తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు.
ఆన్‌లైన్ క్లాస్‌లు, కంపెనీల మీటింగ్‌ల కోసం గూగుల్ మీట్‌ను విరివిగా వాడేస్తున్నారు. అయితే, గూగుల్ మీట్‌లో కనెక్షన్ సరిగా ఉండని కారణంగా కాల్స్ మధ్యలోనే డ్రాప్ అవుతున్నాయి.
ఈ కాల్స్ డ్రాప్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకుంది. ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్స్‌కు ఎలాంటి అవాంతరాయం ఏర్పడకుండా మాట్లాడుకోవచ్చు. ఇదే విషయాన్ని గూగుల్ ప్రకటించింది.
మీటింగ్ మధ్యలో పూర్ కనెక్షన్ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్ ఆప్షన్ మెనూ బబుల్ కూడా వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ట్రబుల్‌షూట్, హెల్ప్ ఆప్షన్ వస్తుంది.ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని గూగుల్ పేర్కొంది.