New Smartphones: ఐఫోన్ 15 సిరీస్ నుంచి హానర్ 90 వరకు.. సెప్టెంబర్‌లో లాంచ్ కానున్న టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

|

Aug 29, 2023 | 4:27 PM

Smartphones Launch in September: సెప్టెంబర్ నెల ప్రారంభం అయ్యేందుకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. దీంతో సెప్టెంబర్ నెలలో ట్రెండీ ఫీచర్లతో సరికొత్త మొబైల్స్‌ను లాంచ్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఆపిల్, శామ్సంగ్, మోటోరోలా, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో లాంచ్ చేయబోతున్నాయి. ఈ క్రమంలో సెస్టెంబర్ నెలలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
Apple iPhone 15 Series: ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్‌లో రానుంది. ఈ సిరీస్‌లో iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone 15 Plus, iPhone 15 Ultra ఉన్నాయి. అలాగే సరికొత్త ఐఫోన్ 15 సిరీస్‌లో A17 చిప్‌సెట్, కెమెరా సెన్సార్, ఆకర్షిణీయమైన డిజైన్‌, ఫీచర్లు, మెరుగైన పనితీరు ఉండనునన్నాయి. 

2 / 5
Samsung Galaxy S23 FE: సెప్టెంబర్‌ నెలలో Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ కానుంది. ఈ Galaxy S23 FE ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల Full HD+ డైనమిక్ AMOLED డిస్‌ప్లే, సరికొత్త Qualcomm Snapdragon 8 Gen 1 SoC లేదా Exynos 2200 SoC ఉండవచ్చని అంచనా. Android 13 OS ఆధారంగా పనిచేసే OneUI 5.1ని కలిగి ఉంటుందని, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 4,500mAh బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

3 / 5
Moto G84 5G: మోటో కంపెనీ నుంచి సెప్టెంబర్‌లో Moto G84 5G స్మార్ట్‌ఫోన్ రానుంది. దీని స్పెసిఫికేషన్‌ల ప్రకారం అంచనా ధర రూ. 20,000 నుంచి రూ 30,000 వరకు ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10-బిట్ పోలెడ్ టెక్నాలజీతో 6.55-అంగుళాల 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 30W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ బ్యాకప్ ఉండవచ్చు.

4 / 5
Moto G54 5G: మోటొరోలా నుంచి సెప్టెంబర్ నెలలో రానున్న మరో స్మార్ట్‌ఫోన్ Moto G54 5G. టెక్ నివేదికల ప్రకారం ఇందులో 50MP కెమెరా, 6.5-అంగుళాల FHD+ డిస్ప్లే , 5,000mAh బ్యాటరీ బ్యాకప్ ఉండనున్నాయి.

5 / 5
Honor 90: హానర్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో సెప్టెంబర్ నెలలో మరోసారి కస్టమర్ల అదరణ పొందేందుకు సిద్దమయ్యింది. ఈ మేరకు సెప్టెంబర్ నెలలో తన Honor 90 మొబైల్‌ని లాంచ్ చేయబోతుంది. టెక్ నివేదికల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ ఫ్రంట్ కెమెరా, 66W చార్జింగ్ సప్పోర్ట్, 5000 mAh బ్యాటరీ బ్యాకప్ వంటి పలు ఫీచర్లు ఉండనున్నాయి.