ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7: ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 ఫోన్‌పై కూడా మంచి ఆఫర్ అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ఏకంగా 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 ఫోన్ అసలు ధర రూ. 9,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,999కే లభిస్తోంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 13 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
మోటోరోలా ఈ13: మోటోరోలా స్మార్ట్ ఫోన్‌పై సేల్‌లో భాగంగా 35 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 9,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. యూనిఎస్‌ఓసీ టీ606 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
పోకో సీ51: పోకో సీ51 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 9,999కాగా 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 6,499కే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 6.52 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 ఎంపీ రెయిర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీ: ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ ఫోన్‌పై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ. 7,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 5,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 8 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్04: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్‌పై 28 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 11,499కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 8,199కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు రకాల బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చు. 13 ఎంపీ రెయిర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం. 6.5 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇచ్చారు.