Fire-boltt gladiator plus: మార్కెట్లోకి మరో సూపర్ స్మార్ట్ వాచ్.. తక్కువ ధరలో అంత స్టైలిష్ వాచ్..
ప్రముఖ గ్యాడ్జెట్ సంస్థ ఫైర్ బోల్ట్ ఇటీవల వరుసగా స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. యాపిల్ వాచ్ లుక్‌ను పోలిన డిజైన్, అదిరిపోయే ఫీచర్లు ఈ వాచ్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. వాటర్ రెసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్ కూడా ఉండడం ఈ వాచ్ స్పెషాలిటీ. ఈ వాచ్ లో 115 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, రిమోట్ కెమెరా కంట్రోల్, అలారం, స్టాప్‌వాచ్, వెదర్ అప్‌డేట్స్, స్మార్ట్ నోటిఫికేషన్స్ వంటి మరెన్నో ప్రత్యేక ఫీచర్స్ ఈ స్మార్ట్ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి...