
టిక్‌టాక్ యాప్ భారత్‌లో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌తో చాలా మంది సెలబ్రిటీలుగా మారారు.

అయితే కేంద్ర ప్రభుత్వం భారత్‌లో ఈ యాప్‌ను నిషేధించిన తర్వాత ఈ యాప్ స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ 'రీల్స్' పేరుతో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ ఫీచర్‌కు కొనసాగింపుగా.. 'రీల్స్ ఆన్ ఫేస్‌బుక్'గా మార్చనుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకోవచ్చు.

అగ్మెంట్‌డ్ రియాల్టీతో ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొంతమంది యూజర్లకు ఈ అవకాశాన్ని కలిపించింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

మరి ఫేస్‌బుక్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ యూజర్లను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.