రియల్ మీ 11 సిరస్: ఈ రియల్ మీ సిరీస్‌లో మూడు ఫోన్లు ఉన్నాయి, రియల్ మీ 11, 11 ప్రో, 11 ప్రో ప్లస్. ఇందులో 11 ప్రో ప్లస్ 200 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆకర్షణీయంగా ఉంది. ఈ మూడు ఫోన్లు 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తున్నాయి. అయితే ఈ ఫోన్లు అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఈ ఫోన్లు చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రియల్ 11 ధర రూ.19,000 నుంచి రూ.21,400, రియల్ మీ 11 ప్రో ధర రూ.23,700 నుంచి రూ.27,300, 11 ప్రో ప్లస్ ధర రూ.28,500 నుంచి రూ.33,200 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.