
రాత్రి పూట వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా..? అయితే మీరు అనారోగ్య సమస్యల బారిన పడొచ్చు. అవును.. ఇది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీంతో రాత్రివేళ వైఫై ఆఫ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వై-ఫై సిగ్నల్స్ నిద్రకు ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వైఫై రూటర్‌కి దగ్గర నిద్రించేవారిలో 27 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారట. దీంతో పాటు వైఫై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, రేడియోషన్ నిద్రను పాడు చేస్తాయని హెచ్చరిస్తున్నారు. దీంతో రాత్రిపూట వైఫై ఆఫ్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

రాత్రిపూట వైఫై ఆఫ్ చేయడం వల్ల డిజిటల్ ప్రపంచం నుంచి మనం బయటకు వచ్చినట్లు అవుతుంది. దీని వల్ల మన మెదడు ప్రశాంతంగా ఉండటం వల్ల నిద్ర మంచిగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రుల్లో వైఫై స్విచ్చాఫ్ చేయడం వల్ల కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. ఇక ఆఫ్ చేయడం వల్ల బ్యాగ్రౌండ్ అప్ డేట్స్ కూడా నిలిచిపోతాయి.

బ్యాగ్రౌండ్ అప్ డేట్స్ ఆగిపోవడం వల్ల మీ వైఫై డేటా కూడా ఆదా అవుతుంది. ఇక మీ వైఫై హ్యాకింగ్ అయ్యే ముప్పు కూడా తగ్గుతుంది. ఇక వైఫై ఎప్పుడూ ఆన్ చేసి ఉంచడం వల్ల వేడి ఎక్కువై దాని సామర్థ్యం కూడా తగ్గుతుంది. రాత్రి వేళల్లో అవసరం లేని సమయంలో ఆఫ్ చేయడం వల్ల రౌటర్ ఎక్కువకాలం పనిచేస్తుంది.

ఇలా రాత్రి సమయాల్లో వైఫై ఆఫ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవసరం లేని సమయంలో వైఫై ఆఫ్ చేసుకోవడమే మంచిది. దీని వల్ల రేడియోషన్ తగ్గడమే కాకుండా కరెంట్ ఆదా అవ్వడం లాంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ మీరు వైఫై స్విచ్చాఫ్ చేయకూడదు అనుకుంటే బెడ్ రూంలో కాకుండా బయట హాల్‌లో రౌటర్ పెట్టుకోండి