ఎల్జీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలోని 4కె అల్ట్రా హెచ్ డీ టెక్నాలజీ కారణంగా స్క్రీన్‌పై చిత్రం అధిక నాణ్యతతో కనిపిస్తుంది. ఈ టీవీకి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ తదితర వాటితో సహా అపరిమిత ఓటీటీ యాప్ సపోర్ట్ ఉంది. 4కే అప్‌స్కేలర్ మద్దతు కారణంగా పిక్చర్ నాణ్యత పెరుగుతుంది. ఈ 55 అంగుళాల టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీఆర్ 10 మద్దతు ఉంది. వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీవీ ధర రూ.43,990. దీనిలో 1.5 జీబీ రామ్, 8 జీబీ మెమరీ కెపాసిటీ ఉన్నాయి.