Realme C63 5G: రూ. 10వేలలో రియల్‌మీ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

|

Aug 13, 2024 | 11:02 PM

మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా 5జీ సేవలు విస్తరిస్తున్న తరుణంలో తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌లు తీసుకురాగా. తాజాగా మరో కొత్త ఫోన్‌ మార్కెట్లోకి వస్తోంది. రియల్‌మీ సీ63 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ సీ63 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ అమ్మకాలు ఈ నెల20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే రియల్‌మీ సీ63 5జీ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన 6.67 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లేను ఇస్తున్నారు. 720×1604 పిక్సెల్స్ రిజల్యూషన్‌, 625 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను అందిచారు.

3 / 5
ధర విషయానికొస్తే ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

4 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 10వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందిచారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.