
ప్రస్తుతం టెలికాం సంస్థల మధ్య పోటీ నెలకొంది. దీంతో యూజర్లను అట్రాక్ట్ చేసే క్రమంలో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి సంస్థలు. ముఖ్యంగా ఇంటర్‌నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో డేటాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగానే సంస్థలు డేటా ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి.

అయితే చాలా వరకు రీఛార్జ్ ప్లాన్స్ రోజులో పరిమిత మొత్తంలోనే డేటాను అందిస్తున్నాయి. దీంతో అన్‌లిమిటెడ్ డేటా కోసం యూజర్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మంచి రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

రూ. 398 రీఛార్జ్ చేసుకున్న వారికి మంచి బెనిఫిట్స్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా రోజు మొత్తంలో ఎలాంటి పరిమితి లేకుండా డేటాను వాడుకోవచ్చు.

ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందొచ్చు. రోజులో ఎక్కువ డేటా ఉపయోగించుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఇక బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు ఈ రీఛార్జ్‌ను గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్, బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.