ఇక ఎంఎస్ఐ థిన్ 15 ఇంటెల్ ఐ5 -12 జెన్ ల్యాప్‌టాప్‌పై కూడా మంచి ఆఫర్ లభిస్తోంది. ఆర్టీఎక్స్ 2050 జీపీయూతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 70,990 కాగా సేల్‌లో భాగంగా రూ. 44,990కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఏసర్ కంపెనీకి చెందిన ఏఎల్జీ ఇంటెల్ ఐ5 12 జెన్, ఆర్టీఎక్స్ 2050 జీపీయూ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 89,990 కాగా సేల్ భాగంగా రూ. 48,470కే సొంతం చేసుకోవచ్చు.