Asus ZenFone8: అసూస్ నుంచి అద‌ర‌గొట్టే స్మార్ట్ ఫోన్‌.. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు.. ఓ లుక్కేయండి..

|

May 13, 2021 | 4:19 PM

Asus ZenFone8: భారీ స్ర్కీన్ల‌తో కూడిన స్మార్ట్ ఫోన్‌ల‌ను ఉప‌యోగించ‌డం ఇష్టం లేని వారిని ల‌క్ష్యంగా చేసుకొని అసూస్ స‌రికొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఐఫోన్ 12కు గట్టి పోటీనిస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి...

1 / 7
థైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ త‌యారీ సంస్థ అసూస్ తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. జెన్‌ఫోన్ 8 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 12కి పోటీనిస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

2 / 7
భారీ సైజ్‌లో ఉండే స్క్రీన్ల‌ను ఉప‌యోగించ‌డం ఇష్టం లేని వారిని ల‌క్ష్యంగా చేసుకొని ఈ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు. ఈ ఫోన్‌ను 5.9 ఇంచుల తెర‌తో త‌యారు చేశారు.

3 / 7
ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్టంతో న‌డిచే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో న‌డుస్తుంది.

4 / 7
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే... 1080పీ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రేష్‌రేట్‌ల‌తో పాటు ఐపీ68 వాట‌ర్‌/డ‌స్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ అందించారు.

5 / 7
స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌తో న‌డిచే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ డేటా స్టోరేజ్‌ను అందించారు.

6 / 7
ఇక కెమెరా విష‌యానికొస్తే.. 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా దీని సొంతం. వైర్‌లెస్ ఛార్జింగ్ ఈ ఫోన్ మ‌రో ప్ర‌త్యేక‌త‌.

7 / 7
4000 ఎమ్ఏహెచ్ ప‌వ‌ర్ ఫుల్ బ్యాట‌రీని పొందుప‌రిచారు. దీంతో ఒక్క రోజు ఎలాంటి ఢోకా లేకుండా ఛార్జింగ్ వ‌స్తుంది.