Apple watch: యాపిల్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌.. ఫీచర్స్‌ చూస్తే ఔరా అనాల్సిందే..

|

Nov 23, 2023 | 1:16 PM

యాపిల్‌ కంపెనీ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే చాలు ఆ క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్స్‌ మొదలు వాచ్‌ల వరకు యాపిల్‌ బ్రాండ్‌కు ఉన్న విలువే వేరు. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్‌ నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌ వస్తోంది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ను9ను లాంచ్‌ చేసింది. సెప్టెంబర్‌ 22వ తేదీన ఈ వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9ను వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఇటీవల లాంచ్‌ చేసింది. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్‌ ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.

2 / 5
ఇక యాపిల్‌ వాచ్‌ 9 సిరీస్‌ ధర విషయానికొస్తే భారత్‌లో రూ. 41,900 ప్రారంభ ధరతో లాంచ్‌ అయ్యింది. జీపీఎస్, సెల్యులార్ మోడల్స్‌లో వాచ్‌ను లాంచ్‌ చేశారు. మిడ్ నైట్, స్టార్ లైట్, పింక్, సిల్వర్, ప్రొడ‌క్ట్ రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

3 / 5
ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్‌గా ఉంటుంది. ఇక ఈ వాచ్‌ను ఒక్క‌సారి చార్జ్ చేస్తే 18 గంట‌ల పాటు పనిచేస్తుంది. యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఇచ్చారు.

4 / 5
ఇక ఈ వాచ్‌లో ఉన్న మరో ప్రత్యేక ఫీచర్‌ డబుల్‌ ట్యాప్‌ జెస్చర్‌ దీని ద్వారా యూజర్లు కాల్స్‌ ఆన్సర్ చేసుకోవచ్చు. మ్యూజిక్‌ కంట్రోల్‌తో పాటు కెమెరాను ఆపరేట్ చేసుకోవచ్చు.

5 / 5
హైకింగ్‌, సైక్లింగ్‌ వంటి హెల్త్‌ ఫీచర్స్‌ ఈ వాచ్‌ సొంతం. ఇక యాపిల్‌ వాచ్‌ సిరీస్‌9 వాచ్‌లో మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేసే హెల్త్‌ సపోర్ట్ టూల్స్‌ను అందించారు.