Republic day sale: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15వేలలోనే బెస్ట్‌ ఫోన్స్‌

| Edited By: TV9 Telugu

Jan 22, 2024 | 5:37 PM

ప్రస్తుతం పండగ సీజన్‌ను పురస్కరించుకొని మార్కెట్లోకి కొంగొత్త స్మార్ట్‌ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇక తాజాగా రిపబ్లిక్‌ డే సేల్ పేరుతో అమెజాన్‌ ఊహకందని ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా రూ. 15 వేలలో లభిస్తున్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్ డే సేల్‌ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ సేల్‌ 18వ తేదీ వరకు కొనసాగనుంది. సేల్‌లో భాగంగా కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 15,000 లోపు లభిస్తున్న కొన్ని బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.

2 / 5
ఐకూ జెడ్‌6 లైట్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా సేల్‌ భాగంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.58 ఇంచెస్‌తో కూడిన 120Hz IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ 4 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
ఐకూ జెడ్‌7ఎస్‌ 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 23,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 14,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.38 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే 64 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ సేల్‌లో భాగంగా రూ. 15 వేల లోపు లభిస్తున్న మరో బెస్ట్ స్మార్ట్‌ ఫోన్‌ రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 17,999కాగా సేల్‌లో భాగంగా రూ. 12,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కెమెరాను అందించారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
ఇక సేల్‌లో భాగంగా రూ. 15 వేలలో లభిస్తున్న మరో స్మార్ట్ ఫోన్‌ రియల్‌ మీ12 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 17,999కాగా సేల్‌లో భాగంగా రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఎమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.