Amazon Sale: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. రూ. 10 వేల లోపు బెస్ట్‌ ఫోన్స్‌ ఇవే

Edited By: TV9 Telugu

Updated on: Jan 13, 2024 | 7:14 PM

భారతదేశంలోని ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ప్రస్తుతం రిపబ్లిక్‌ డే సేల్‌ హవా నడుస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఈ-కామర్స్‌ కంపెనీలు ఈ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపులను ప్రకటించాయి. ముఖ్యంగా అమెజాన్‌లో గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై నమ్మకమైన ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేక తగ్గింపులతో పాటు అదనంగా బ్యాంకు ఆఫర్లను ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నారు. కాబట్టి అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌లో రూ.10 వేల లోపు ఏయే ఫోన్లను కొనుగోలు చేయవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
లావా బ్లేజ్‌​ 5జీ ఫోన్‌ 4 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో కొనుగోలు అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర రూ.16,999 కాగా ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌లో రూ.9999కు అందుబాటులో ఉంది. ఈ ధరకు అదనంగా బ్యాంకు ఆఫర్లను పొందవచ్చు. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్‌ మధ్యతరగతి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

2 / 5
అప్పో ఏ 18 4 జీబీ + 64 జీబీ, 4జీబీ + 128 జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌లో 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ 6.56 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో 720x1612 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13తో పని చేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. ఈ ఫోన్‌ వాస్తవ ధర రూ.14,999. అయితే ఈ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.10000కే సొంతం చేసుకోవచ్చు.

3 / 5
పోకో సీ 55 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ 6.71 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో  ఆకర్షణీయంగా ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియా టెక్‌ హీలియో జీ 85 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌ ఈ సేల్‌లో రూ.6499కు కొనుగోలు చేయవచ్చు.

4 / 5
రెడ్‌ మీ 13సీ తక్కువ ధరకు వచ్చే 5జీ ఫోన్‌గా ప్రజాదరణ పొందింది. ఈ ఫోన్‌ 4 జీబీ +128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.  6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌ ఈ సేల్‌లో కేవలం రూ.7999కు సొంతం చేసుకోవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 18 వాట్స్‌ ఫాస్ట్‌ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

5 / 5
రియల్‌మీ నార్జో ఎన్‌ 55 ఫోన్‌ 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌లో లభ్యం అవుతుంది. ఈ ఫోన్ 90 హెచ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13తో పని చేసే ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. ఈ ఫోన్‌ను ఈ సేల్‌లో కేవలం రూ.9499కే సొంతం చేసుకోవచ్చు.