భారతదేశం చేపట్టిన తొలి సోలార్ మిషన్ ‘ఆదిత్య-L1’ను శ్రీహరికొట నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11:50 గంటలకు లాంచ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది.
అది ఎంత దూరం ప్రయాణిస్తుంది..? ఆదిత్య-L1 రాకెట్ మొత్తం 1.5 మిలియన్ కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సూర్యుడు-భూమి మధ్యలోని లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఇది స్థిరపడనుంది. ఈ దూరం భూమి-చంద్రుడు మధ్య దూరం కంటే 4 రెట్లు ఎక్కువ.
బడ్జెట్ ఎంత?: ఇస్రో చేపడుతున్న ప్రప్రథమ సోలార్ మిషన్ ఆదిత్య-L1 బడ్జెట్ రూ. 400 కోట్లు.
గమ్యం చేరుకోవడానకిి ఎంత సమయం?: ఆదిత్య L1 దాని గమ్యాన్ని చేరుకోవడానికి దాదాపు 4 నెలల సమయం పడుతుంది. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతూ తన అధ్యయనం చేస్తుంది.
ఇదిలా ఉండగా, ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైతే.. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి శాటిలైట్‌ను పంపిన తొలి అంతరిక్ష పరిశోధన సంస్థగా ఇస్రో చరిత్ర సృష్టిస్తుంది.