Brinjal Benefits: వంకాయతో బోలెడు ప్రయోజనాలు.. క్యాన్సర్, షుగర్‌కి చెక్‌పెట్టే మంత్రం..!

|

Jul 19, 2024 | 7:56 PM

ఈ కాలం లో ఆరోగ్యమే మహా భాగ్యంగా పాటిస్తున్నారు ప్రతిఒక్కరూ.. హెల్త్ విషయం లో మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలు వాటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎంత మేలు చేస్తాయి అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే . అయితే అన్నింటిలో వంకాయ ఇప్పుడు ట్రేండింగ్ వెజిటేబుల్ గా మారింది. పండ్లలో రారాజు మామిడి పండు ఎలానో కూరగాయల్లో రాజు వంకాయ అని పిలుస్తారు. అందుకే వంకాయ మీద తెలుగు సినిమాల్లో అనేక పాటలు, చాల కవిత్వాలు కూడా ఉన్నాయి. అవును మరీ అంతా ఫెమస్ వంకాయ.. అలాంటి వంకాయతో ఆరోగ్య పరంగా పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 5
వంకాయ అన్ని కూరగాయలు లానే ఒక మాములు కూరగాయ అయినా, చాల మంది మాత్రం దీన్ని ఎక్కువగా తినడానికి లైక్ చేస్తారు. అందరూ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వంకాయను కేవలం మన దేశం లోనే కాకుండా ప్రపంచం మొత్తం తింటారు.  చైనా,బంగ్లాదేశ్,ఫిలిప్పీన్స్ దేశ ప్రజలు వంకాయలను మక్కువగా తింటారు. ఇంతకు వంకాయలో ఏముంటాయో పోషకాలు చూద్దాం

2 / 5
వంకాయలో కెరోటినాయిడ్స్ అనే పోషకాలు ఉన్నాయి. ఈ కెటినాయిడ్స్ విటమిన్ ఏ లోపాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి వంకాయను తినడం వల్ల విటమిన్ ఏ మనకు సరిపడా లభిస్తుంది అని వైద్యుల సూచన. విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగుపడుతుంది.

3 / 5
నిత్యం మన ఆహారం లో వంకాయలను విరివిగా తీసుకుంటే కంటి సమస్యలకు చెక్ పెట్టినట్టే. అదేవిదంగా వంకాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బో హైడ్రేట్ లు తక్కువగా ఉంటాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిస్  తో బాధపడుతున్న వారికీ దాన్ని నివారించడం లో చాల వరకు ఉపయోగపడుతుంది.

4 / 5
దానికి తోడు వంకాయల్లో కేలరీలు కూడా చాల తక్కువగా ఉంటాయి. తిన్నాక జీర్ణం కూడా త్వరగా అవుతుంది. బాడీలో ఉన్న కొవ్వును తగ్గించడం లో కూడా వంకాయలు చాల కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త తీసుకోవాలి. వంకాయ కూర వండేప్పుడు నూనె తక్కువ ఉపయోగించాలి అనేది వైద్యుల సూచన.

5 / 5
ఎక్కువ ఆయిల్ వాడితే ఇందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. . వీటితో పాటు వంకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల వరకు ఉండదు అని వైద్య నిపుణుల మాట. వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్దాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి ఇన్ని అద్భుతాలు ఇంత ఆరోగ్యకర విలువలు ఉన్న వంకాయలను మిస్ అవొద్దు..