Money Plant: మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు పక్కా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Updated on: Mar 10, 2026 | 6:51 PM

ప్రస్తుతం ఇండోర్ ప్లాంట్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మనీ ప్లాంట్. అందమైన ఆకుపచ్చని రంగుతో ఇంటికి నిండుదనాన్ని ఇచ్చే ఈ మొక్క వెనుక కేవలం అలంకారమే కాదు.. అంతకు మించిన ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? గాలిని శుద్ధి చేయడంలో దీనికి సాటి మరేదీ లేదని నిపుణులు చెబుతున్నారు. అసలు మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కలిగే లాభాలేంటో, దానిని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మనీ ప్లాంట్ పెంచేటప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమాలు: సరైన దిశ: మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశ (South-East) లో ఉంచడం శుభప్రదం. ఈ దిశకు వినాయకుడు అధిపతి, శుక్రుడు పాలకుడు. కాబట్టి, ఇది సంపదను ఆకర్షిస్తుంది. ఈశాన్య దిశలో మాత్రం అస్సలు ఉంచకూడదు.

2 / 5
తీగలు పైకి ఉండాలి: మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ కిందికి పారకూడదని, అవి పైకి పాకేలా చూడాలని, అప్పుడే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్ తీగలు అభివృద్ధికి చిహ్నం. కాబట్టి అవి నేలను తాకకుండా, పైకి పాకేలా ఏదైనా ఆధారం ఏర్పాటు చేయాలి. తీగలు కిందికి వేలాడటం ఆర్థిక నష్టానికి సంకేతంగా పరిగణిస్తారు.

3 / 5
ఎండిన ఆకులు తొలగించాలి: మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఆకులు ఎండిపోయినా లేదా పసుపు రంగులోకి మారినా వెంటనే వాటిని తొలగించాలి. ఎండిన మొక్క ఇంట్లో దురదృష్టాన్ని తెస్తుంది.  మనీ ప్లాంట్ మొక్కను ఉదయం లేదా సాయంత్రం వేళలో నాటడం మంచిది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, శుక్రవారం రోజున మనీ ప్లాంట్‌ను నాటడం శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.

4 / 5
ఎండ తగలాలా? వద్దా?: చాలా మంది చేసే తప్పు ఏంటంటే మనీ ప్లాంట్‌ను నేరుగా ఎండలో పెట్టడం. ఈ మొక్కకు ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు. ఇంటి లోపల వెలుతురు వచ్చే కిటికీల దగ్గర లేదా బాల్కనీలో నీడ ఉన్న చోట ఉంచితే ఇది ఏపుగా పెరుగుతుంది.

5 / 5
ఒత్తిడికి విరుగుడు: ఇంట్లో పచ్చదనం ఉండటం వల్ల కళ్లకు రిఫ్రెషింగ్‌గా ఉండటమే కాకుండా పని ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఈ చిన్న మొక్క మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది.

Follow Us