
ఈ రెండింటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే.. అయితే గుమ్మడి గింజల్లో ఉండే జింక్, మెగ్నీషియం, విటమిన్ E వంటి పోషకాలు.. మన చర్మ ఆరోగ్యాన్ని, గుండె పనితీరును మెరుగుపరచడంతో పాటు, శరీంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల భారీ నుంచి కాపాడుతాయి. అలాగే సన్ ప్లవర్ సీడ్స్‌లో ఉండే విటమిన్ B1, ఫోలేట్, ఫైబర్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఇక్కడ చూద్దాం.

గుమ్మడి గింజల ప్రయోజనాలు: గుమ్మడి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్, విటమిన్ E, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అలాగే వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటు, బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ ఉంచి గుండె సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది.

అంతేకాదు.. వీటిని రోజూ తినడం వల్ల వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్, మెగ్నీషియం మెదడును ప్రశాంతపరిచి, రాత్రిపూట గాఢమైన నిద్ర పట్టేలా చేస్తాయి. అలాగే సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, మూడ్ బాగుంచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి.

సన్‌ప్లవర్ సీడ్స్ ప్రయోజనాలు: ఈ విత్తనాల్లో ఉండే ప్రత్యేక పోషక సమ్మేళనాలు శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను, నొప్పులను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అలాగే అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే వీటిలో ఉండే ప్రొటీన్, విటమిన్ B, సెలీనియం శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి, శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి.

మొత్తంగా గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు రెండూ పోషకాల గనులు. అయితే వీటి ప్రయోజనాలు మీ సమస్యలు, ఎంపికలను బట్టి మారిపోతాయి. గుండె, రోగనిరోధక వ్యవస్థ, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి ఈ రెండింటినీ సమతుల్యంగా రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం ఉత్తమం.