
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణిస్తాయి. అలాగే, ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్నిసార్లు సానుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్ర నిపుణులు రోహిణి నక్షత్రాన్ని శుభప్రదమైనదిగా చెబుతున్నారు. ఎందుకంటే, ఇది అదృష్టాన్ని తెచ్చేదిగా చెబుతారు. ఈ నక్షత్రంలోకి సూర్య దేవుడు సంచారం చేయడం వలన వల్ల రెండు రాశుల వారికి లక్కే లక్కు వారి అదృష్టం కూడా తలుపు తడుతుంది. మరి, ఆ రెండు రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

ధనుస్సు రాశి: లక్ష్మిదేవి ఈ రాశి వారిని అన్ని రకాలుగా అనుగ్రహించనుంది. అంటే, ఆర్ధికంగా లాభ పడనున్నారు . ఇంకా డబ్బు కుప్పలు తెప్పలుగా వీరి ఇంటి మీద కురవనుంది. అలాగే, పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. త్వరలో కారు కొను గోలు చేసే అవకాశం ఉంది. ఆదా యం కూడా డబుల్ అవుతుంది.

వృషభ రాశి : రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వలన వృషభ రాశి వారి కష్టాలు మొత్తం పారిపోతాయి. ఇంకా కొత్తగా ఉద్యోగం చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఫ్రెండ్స్ తో గొడవలకు వెళ్ళకండి. అప్పులన్ని ఒక్క దెబ్బకు క్లియర్ అవుతాయి. ఇంకా వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వైవాహిక జీవితం మారుతుంది. ఇంకా మీకు నచ్చినట్టుగా కొత్త మార్పులు వస్తాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)