
పరుపు జాగ్రత్త.. మీరు వేసవి వేడితాపంతో బాధపడుతుంటే, అతి వేడి, చెమట మిమ్మల్ని బాధిస్తుంది అనుకుంటే, తప్పకుండా మీ దిండు లేదా, పరుపు కూడా దీనికి కారణం కావచ్చు అని గుర్తించాలి. సింథటిక్ ఫ్యా్బ్రిక్‌లు వేడిని బంధిస్తాయి. కాబట్టి, ఈ వేసవిలో మీ బెడ్ షీట్, పిల్లోలను మార్చండి, లినెన్ లేదా కాటన్ షీట్‌లను కొనుగోలు చేయండి. దీని వలన వేడి తగ్గుతుంది. అలాగే నేలపై చాప వేసుకొని పడుకోవడం వలన కూడా వేడి మొత్తం పైకి వెళ్లి మీకు చల్లదనం ఇస్తుంది.

తడి షీట్ ట్రిక్, మీరు సమ్మర్ వేడితో విసిగిపోతుంటే, ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. ఒక కాటన్ క్లాత్ లేదా బెడ్ షీట్ తీసుకొని దానిపై చల్లని నీటిని చల్లి, దానిని తెరిచిన కిటికీ ముందు వేలాడదీయండి. దీని వలన మీరు కునుకు తీసే సమయంలో చల్లటి గాలి వస్తుంది. అది రూమ్ మొత్తం చల్లగా చేస్తుంది. దీని ఏసీ, కూలర్ కూడా అవసరం లేని విధంగా చల్లదనాన్ని ఇస్తుంది.

కిటికీ జాగ్రత్తలు.. చాలా మంది రోజు మొత్తం కిటికీలు తెరిచి ఉంచుతారు. కానీ ఇలా బయట వేడి సమయంలో కూడా కిటికీలు తెరిచి ఉంచడం వలన ఇంటిలోకి వేడి వెళ్తుంది. అందువలన పగటి సమయంలో కిటికీలు క్లోజ్ చేసి, సాయంత్రం 5గంటల తర్వాత మాత్రమే కిటికీలు ఓపెన్ చేయాలి. దీని వలన ఇంటిలోని వేడి గాలి బయటకు వెళ్లి, చల్లని గాలి ఇంటిలోకి ప్రవేశిస్తుంది.

చాలా మంది సమ్మర్‌లో గదిని ఎలా చల్లగా ఉంచాలని ఆలోచిస్తుంటారు. కానీ గదిని కాకుండా ముందుగా మీ బాడీని చల్లగా ఉంచడానికి ట్రై చేయండి. దీని వలన మీరు రోజంతా చల్లగా ఉండొచ్చు. దీని కోసం మీ చేతి మణికట్టు లేదా మెడ వెనక భాగంలో చీలమండల మీద చల్లటి పట్టి లేదా ఐస్ ప్యాక్ పెట్టుకోండి. దీని వలన మీ శరీరం మొత్తం చల్లగా అయిపోతుంది.

ఫ్యాన్ దిశను మార్చడం వలన కూడా మీ గదిలోని వేడి గాలి బయటకు పోతుంది. ఫ్యాన్‌ను తెరిచి ఉన్న కిటికీ వైపు ఉంచడం వలన లోపలి వేడి గాలి మొత్తం బయటకు వెళ్లిపోతుంది. దీని వలన స్వచ్ఛమైన గాలి లోని వస్తుంది. దీంతో రూమ్ మొత్తం చల్లగా మారిపోతుంది.