Summer Face Wash Tips: వేసవిలో ముఖం కడుక్కోవడానికి సంబంధించిన ఈ తప్పులను చేస్తున్నారా .. మీరు ఇబ్బందుల్లో పడినట్లే..

|

Apr 18, 2023 | 4:27 PM

ముఖానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. వేసవిలో పొరపాటున కూడా పునరావృతం కాకూడని కొన్ని సాధారణ తప్పులను గురించి ఈ రోజు తెలుసుకుందాం..  

1 / 6
వేసవిలో ఎండ వేడికి ఆరోగ్యమే కాదు, చర్మం కూడా దెబ్బ తింటుంది. వడదెబ్బ, టానింగ్, చికాకు, తేమ లేకపోవడం వంటి అనేక సమస్యలను చర్మం ఎదుర్కోవలసి ఉంటుంది. వేసవిలో ముఖ్యంగా ముఖంపై చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి వడదెబ్బ తగిలితే.. దాని ప్రభావం అనేక సీజన్లలో ఉంటుంది. డల్ స్కిన్ తో మొత్తం లుక్ పాడైపోయేలా చేస్తుంది

2 / 6
సాధారణంగా వేసవి కాలమైనా, చలికాలమైనా.. ముఖం కడుక్కోవడం ఎంత ముఖ్యమో అందరికి తెలుసు. అయినప్పటికీ, ప్రజలు చర్మానికి హానికరం అని నిరూపించే అనేక పొరపాట్లు చేస్తారు.

3 / 6
ఎండాకాలంలో ముఖం కడుక్కోవడం మంచిదే.. అయితే కొందరు రోజుకు ఒక్కసారే చేస్తుంటారు. రోజుకు కనీసం రెండు సార్లు ముఖం కడుక్కోవాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు. ఇలా చేస్తే.. వేసవిలో చర్మం గ్లో పోకుండా.. నల్లబడకుండా ఉంటుంది. 

4 / 6
సమ్మర్ స్కిన్ కేర్ అంటూ పదే పదే ముఖం కడుకునే విషయంలో చాలా సార్లు తప్పు చేస్తూ ఉంటారు. ముఖానికి నీరు, ఫేస్ వాష్‌ని పదే పదే అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయడం కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. కనుక రోజుకు రెండు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు.

5 / 6
వేసవిలో వడదెబ్బ, దుమ్ము-మట్టి కారణంగా, చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. చర్మంపై మెరుపును తీసుకురావడానికి.. ఎక్కువ సార్లు స్క్రబ్బింగ్ చేయడానికి అత్యంత సాధారణమైన ఎక్స్‌ఫోలియేషన్ పద్ధతిని అవలంబిస్తారు. చర్మంపై వీటితో అధికంగా రుద్దడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. చర్మ సంరక్షణ విషయంలో ఇది అతి పెద్ద తప్పు. మీరు వారానికి రెండుసార్లు మృతకణాలను క్లిన్ చేసే పద్దతిని అనుసరించవచ్చు. 

6 / 6
వేడి నీరు చర్మ సంరక్షణలో ప్రధమ పాత్ర అని చాలామంది భావిస్తారు. మురికి, నలుపును తొలగించడంలో వేడి నీరు ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తారు. అయితే వేసవిలో ఇలా చేయడం వలన చర్మం కమిలిపోతుంది. వేసవిలో వేడి నీళ్లతో చర్మాన్ని శుభ్రం చేసుకునే బదులు సాధారణ నీటితో శుభ్రపరిచే పద్ధతిని అవలంబించండి.