ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సులభంగా ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

Updated on: Oct 20, 2026 | 8:51 AM

ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచిగల వెజ్ మంచూరియాను సులభంగా తయారుచేసుకునే విధానం ఇక్కడ చూడండి. క్యాబేజీతో చేసే ఈ రెసిపీ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ రుచితో దీన్ని సిద్ధం చేసుకోవచ్చు. దీనికి కావల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం..

1 / 5
ముందుగా, మీడియం సైజు క్యాబేజీని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, వీలైనంత సన్నగా తరిగి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ క్యాబేజీకి రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి, క్యాబేజీని నలుపుతూ బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల క్యాబేజీలో ఉండే నీరు బయటకు వచ్చి, పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది.

2 / 5
 ఇప్పుడు అందులో పావు కప్పు మైదా, రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్,  ఒక టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, చిటికెడు ఫుడ్ కలర్ రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకుండా చూసుకోవాలి.

3 / 5
ఈ క్యాబేజీ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా తయారుచేసుకోవాలి.ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి, మీడియం మంటపై వేడి చేయాలి. నూనె వేడయ్యాక, సిద్ధం చేసుకున్న క్యాబేజీ బాల్స్‌ను ఒక్కొక్కటిగా వేసి, మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా, బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. వేగిన మంచూరియా బాల్స్‌ను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

4 / 5

మరొక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, పావు గ్లాసు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.

5 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికం, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికం పూర్తిగా మెత్తబడకుండా కొద్దిగా క్రంచీగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ సోయా సాస్, రెండు టీ స్పూన్ల టమాటో సాస్, ఒక టీ స్పూన్ వెనిగర్, అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, పావు టీ స్పూన్ పంచదార వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక, ముందుగా మనం నీటిలో కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పోసి, ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో మరగనివ్వాలి. గ్రేవీ చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. సాస్ ఉడికిన తర్వాత సాస్‌కు తగినంత ఉప్పు ముందుగా మనం వేయించుకున్న క్యాబేజీ బాల్స్‌ను వేసుకొని, మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు సాస్ బాల్స్‌కు పట్టేలా బాగా కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే, చాలా టేస్టీగా, స్ట్రీట్ స్టైల్ రుచితో ఉండే వెజ్ మంచూరియా రెడీ

Loading...
Unable to load recommendations.
Follow Us