
చర్మం: శీతాకాలంలో పొడి, నీరసమైన చర్మంతో మీరు ఇబ్బంది పడుతుంటే, ఉసిరి తినడం ప్రారంభించండి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతాయి.

చ్యవన్‌ప్రాష్: రోగనిరోధక శక్తి పెంచుతుందని చాలామంది చ్యవన్‌ప్రాష్‌ను వాడుతుంటారు. కానీ ఇందులో చక్కెర శాతం చాలా ఎక్కువ. తాజా పండ్లు, కూరగాయల కంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి. వేడివేడి ఇంటి వంటలు, కూరగాయల సూప్‌లు తాగండి. ఇవి ఎటువంటి చక్కెర లేకుండా శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.

డ్రై ఫ్రూట్స్ లడ్డులు: చలికాలంలో శక్తి కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డులు తినడం ఆనవాయితీ. కానీ వీటిలో నెయ్యి, బెల్లం కలపడం వల్ల కేలరీలు భారీగా పెరుగుతాయి. ఒక్కో లడ్డులో దాదాపు 200 కేలరీలు ఉంటాయి. ఇది శరీరంలో కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. లడ్డుకు బదులుగా ఒక చిన్న గుప్పెడు నట్స్ తీసుకోండి. కేలరీలు పెరగకుండా పోషకాలు అందుతాయి.

రెడీ-టు-ఈట్ ప్యాకేజ్డ్ సూప్‌లు: ప్యాకెట్లలో దొరికే ఇన్‌స్టంట్ సూప్‌లు కేవలం 2 నిమిషాల్లో తయారవుతాయి. కానీ ఇవి అత్యంత ప్రమాదకరం. వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి శరీరం ఉబ్బేలా చేస్తుంది. ఇంట్లోనే కూరగాయలు, కాయధాన్యాలతో తాజా సూప్‌లను తయారు చేసుకోండి. ఇవి శరీరానికి వేడిని, ఫైబర్‌ను అందిస్తాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకోవటం వల్ల శరీరంలో హానికరమైన విషవ్యర్ధాలు బయటకు నెట్టివేయబడతాయి. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి అగ్నిని రగిలిస్తుంది. అంటే జీర్ణవ్యవస్థలో అగ్నిని మండిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది.