
క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిన ముల్తాన్‌లో పాకిస్థాన్‌పై సాధించిన ట్రిపుల్ సెంచరీ సెహ్వాగ్‌కు చాలా స్పెషల్. పదునైన పాక్ బౌలింగ్‌ను అతడు చీల్చి చెండాడిన తీరు అభిమానుల మనసుల్లో ఇప్పటికీ అలానే ఉంది. ఆ టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు ఈ రోజు. 'సుల్తాన్ ఆఫ్ ముల్తాన్' అన్న బిరుదునూ సొంతం చేసుకున్నాడు.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వీరూ ఆడిన ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులెప్పటికీ మరిచిపోలేరు. హైలైట్స్‌ను చూస్తున్నామా అన్న భావన కలిగించిన అతడు తన త్రిశతకం (309)తో పాక్ గడ్డపై భారత్‌కు మొట్టమొదటి టెస్టు విజయాన్ని అందించాడు.

375 బంతుల పాటు సాగిన అతడి ఊచకోతలో 39 ఫోర్లు, 6 సిక్స్‌లు వీరు వీరవిహారం చేశాడు. ముఖ్యంగా సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్‌లో సిక్స్‌తో అతడు 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తీరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ రికార్డుకు ఈ రోజుతో 17 ఏళ్లు పూర్తయ్యాయి.

ఆకాశ్ చోప్రాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన వీరూ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన స్ట్రోక్ ప్లేతో పరుగుల వరద పారించాడు.

మ్యాచ్ తొలి రోజే 228 పరుగులు చేసిన సెహ్వాగ్.. రెండో రోజు ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. సచిన్‌తో మూడో వికెట్‌కు 336 పరుగులు జోడించాడు.సరిగ్గా నాలుగేళ్ల తర్వాత సెహ్వాగ్ మరోసారి ట్రిపుల్ సెంచరీ చేశాడు.

వీరందర్ సెహ్వాగ్పాకిస్థాన్‌కు పీడకలలను మిగిల్చిన ముల్తాన్ టెస్టు.. భారత అభిమానులకు మాత్రం ఎప్పుడు తలచుకున్నా సంతోషాన్నిచ్చే అనుభూతులను ఇచ్చింది.