Ravi Kiran |
May 27, 2021 | 7:15 PM
సచిన్ టెండూల్కర్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కరాచీలో పాకిస్తాన్‌పై 15 నవంబర్ 1989లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ ఆటగాడి పేరు సలీల్ అంకోలా. గాయం కారణంగా క్రికెట్ నుంచి నిష్క్రమించిన ఇతడు బుల్లితెరపై మెరిసి.. ఖ్యాతి తెచ్చుకున్నాడు.
మొదటి మ్యాచ్ అరంగేట్రం తర్వాత సలీల్ పలు పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత 1993లో తిరిగి తుది జట్టులోకి రాగా.. అప్పుడు కూడా ఆకట్టుకోలేకపోయాడు.
ఆ తర్వాత కొంతకాలానికి సలీల్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. బోన్ ట్యూమర్ కారణంగా అతడు వైదొలిగాడు. కానీ బుల్లితెరపై మెరిసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.
అతని మొదటి సీరియల్ జీ టీవీలో ప్రసారం కాగా.. ఆ తర్వాత జాల్ ట్రూ, జాల్, సిఐడి వంటి సీరియల్స్‌లో కూడా మెరిశాడు. అంతేకాకుండా సినిమాల్లో పని చేశాడు.
అయితే సలీల్ మరోసారి క్రికెట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చీఫ్ సెలెక్టర్‌గా ఎన్నికయ్యాడు.