Ellyse Perry: పెర్రీ.. పెర్రీ లేడీ.. బ్యూటీ విత్ టాలెంట్.. ఆమె గురించి ఇంట్రస్టింగ్ విషయాలు

|

Mar 14, 2024 | 11:49 AM

ఎలిస్‌ పెర్రీ! అంతర్జాతీయ మహిళా క్రికెట్లో టాప్ ప్లేయర్! అద్భుతమైన పేస్‌ బౌలింగ్‌, మాస్ బ్యాటింగ్‌తో మోస్ట్‌ ప్రామినెంట్‌ క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు విమెన్ ప్రిమియర్ లీగ్‌లో ఆర్సీబీకి ఆడుతోంది. ఆట, అందం కలబోసిన ఈ లేడీ క్రికెటర్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

1 / 5
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో ఎలిస్ పెర్రీ కీ ప్లేయర్‌గా ఉన్నారు. ఆమె టీమ్‌లో ఉన్నారని తెలిస్తే ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తుతారు. 2007 నుంచి ఆమె క్రికెట్ ఆడుతోంది. జాతీయ, వివిధ టీ20 లీగుల్లో ఆడుతోంది. అలానే బిగ్ బాష్, హండ్రెడ్ లీగుల్లో అదరగొడుతోంది.

2 / 5
ఎల్లీస్ అలెగ్జాండ్రా పెర్రీ నవంబర్ 1990న జన్మించింది. క్రికెట్‌తో పాటు సాకర్‌లోనూ రాటుదేలింది. 16 సంవత్సరాల పిన్న వయస్సులోనే పెర్రీ జాతీయ క్రికెట్ జట్టుతో పాటు జాతీయ సాకర్ జట్టులోనూ అరంగేట్రం చేసింది. 2014 నుంచి క్రమంగా.. క్రికెట్‌పై ఫోకస్ పెట్టింది.

3 / 5
 2023లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ సీజన్‌లో , పెర్రీని రూ 1.7 కోట్ల ధరతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది . పెర్రీ సాధారణంగా గంటకు 110 మరియు 115 కిమీల వేగంతో బౌలింగ్ చేస్తుంది. బ్యాటింగ్ చేసేప్పుడు స్ట్రెయిట్ స్ట్రోక్స్ ఆడటానికి ఇష్టపడుతుంది.

4 / 5
24 అక్టోబర్ 2013న, పెర్రీ, ఆస్ట్రేలియన్ రగ్బీ ప్లేయర్ మాట్ టోమువా కలిసి ఓ వేడుకలో పాల్గొని.. అతడితో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. 20 ఆగస్టు 2014న, ఈ జంట ఎంగేజ్‌మెంట్ జరిగింది. వారు  2015, డిసెంబర్ 20న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట చాలా కాఫీ షాపులను కలిసి నిర్వహించేవారు.  వ్యక్తిగత కారణాల వీరు 2020లో విడిపోయారు.

5 / 5
ప్రజంట్ WPLలో పెర్రీ పేరు మారుమోగిపోతుంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆర్సీబీ ఆల్ రౌండర్ అదరగొట్టింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే 6 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచింది. అలానే బ్యాట్‌తోనూ రాణించింది. 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మొన్నామధ్య ఆమె కొట్టిన భారీ సిక్సర్‌కి గ్రౌండ్ బయట సందర్శన కోసం ఉంచిన కారు అద్దం బద్దలయిన విషయం తెలిసిందే. దీంతో పెర్రీ.. పెర్రీ లేడీ అంటూ ఈ లేడీ క్రికెటర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్.