ఒలింపిక్స్ చరిత్రలో 121 సంవత్సరాల తర్వాత అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఇప్పుడు తన హెయిర్‌స్టైల్ విషయంలో సోషల్ మీడియాలో చర్చలో ఉన్నాడు. ఒలింపిక్ పతాకం గెలిచేవరకూ నీరజ్ చోప్రా గురించి తెలిసినవారు తక్కువే. ఇప్పుడిప్పుడే అతని గురించి అందరికీ తెలుస్తోంది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో నీరజ్ చోప్రా స్నేహితులు అతని పాత చిత్రాల్ని షేర్ చేస్తూ వస్తున్నారు. వాటిలో నీరజ్ పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. జుట్టు ఎందుకు కత్తిరించేసుకున్నాడు అని బాధపడిపోతున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు, హర్యానాలోని పానిపట్‌లో నివసించే నీరజ్ చోప్రా జుట్టు కత్తిరించుకున్నాడు. నీరజ్ పొడవాటి జుట్టుతో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారు.. ఇశాంత్ శర్మ.. షారూఖ్ ఖాన్ ల నుంచి హెయిర్ స్టయిల్ తీసుకున్నావా అని కామెంట్స్ పెట్టారు.
నీరజ్ కి తన ఆట ఎంత ఇష్టమో పొడవాటి జుట్టు అన్నా అంతే ఇష్టం. అందుకే ఎక్కువగా పొడవాటి జుట్టును పెంచుకునేవాడు. అయితే, ఒలింపిక్స్ సన్నాహాలలో భాగంగా తన జుట్టును కత్తిరించుకున్నాడు. అలా ఎందుకు చేశాడో అతని మాటల్లోనే. ''పొడవాటి జుట్టు కారణంగా గత కొన్ని పోటీలలోనేను సమస్యలను ఎదుర్కొన్నాను. జుట్టు చెమట పట్టేది. అది కళ్ల ముందు కూడా వచ్చేది. దీంతో జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. జావెలిన్ త్రోకు అది మరింత ఇబ్బంది అనిపించి జుట్టు కత్తిరించేసుకున్నాను.''
ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు నీరజ్ చోప్రాను షల్ మీడియాలో మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలుస్తున్నారు. ధోనీకి కూడా మొదట్లో పొడవాటి జుట్టు ఉండేది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ధోనీ జుట్టును ప్రశంసించిన విషయం తెలిసిందే!