
తన స్వస్థలం రాంచీలో ఖరీదైన భవంతి దాదాపు 6 కోట్లు పెట్టి నిర్మించాడు. ఈ ఇంటిని స్వయంగా మహేంద్ర సింగ్ ధోనీ డిజైన్ చేసి కట్టించుకున్నాడు. ఈ ఇంటికి తన భార్య సాక్షితో కలసి దగ్గరుండి మరమ్మత్తు పనులు, కొద్దిగా మార్పులు, చేర్పులు చేయించాడు మన జార్ఖండ్ డైనమెట్.

రాంచీలో ఫామ్ హౌస్‌లోనే ఉండటానికి ధోనీ ఇష్టపడుతుంటాడు. ఇక్కడే మహీకి మరింత ఇష్టమైన ఆరు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈ ఫామ్ హౌస్‌కు "కైలాస్‌పాటి" అని పేరు కూడా పెట్టుకున్నాడు.

"కైలాస్‌పాటి" నిర్మించేందుకు మూడేళ్ల సమయం పట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ఇదే పనిలో ఉన్నాడు. రాంచీలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ఇంటి నుంచి 20 నిమిషాల్లో ఈ ఫామ్ హౌస్‌కు చేరుకోవచ్చు. ఈ ఇంట్లో మహీ తల్లిదండ్రులు ఉంటారు.

ఈ ఫామ్ హౌస్‌లో జిమ్, స్విమ్మింగ్ పూల్, విలాసవంతమైన లాన్, గార్డెన్ ఉన్నాయి. ధోనీ తన కూతరు జీవాతో కలిసి సరదాగా ఇక్కడే ఉంటాడు. ఇందులో తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి.

పుణెతోపాటు దేశ రాజధాని ముంబైలో చాలా ఖరీదైన ఏరియాలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. గత ఏడాది కిందటే ఈ స్థలంను కొనుగోలు చేశాడు.

పుణెలోని పింప్రీ చిందావాడ్ ఏరియాలో స్థలం కొనుగోలు చేశాడు. ఇదే స్థలంలో 30 కోట్ల రూపాయలతో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు.ఈ ఇంటితోపాటు మొత్తం నాలుగు ఇళ్లు ఉన్నాయి. వీటిన్నింటి విలువ రూ. 110 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ధోనీ ఐపీఎల్ ద్వారా ఏటా రూ.15 కోట్లు అందుకుంటున్నాడు. అంతేకాకుండా వివిధ కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటాడు.

ఇలా మరో 150 కోట్ల వరకు ఆర్జిస్తున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్ ధోనీయే...