
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దేశంలో అత్యంత ఇష్టపడే ప్రముఖ జంటలలో ఒకరు. 34 కోట్లు పెట్టి ముంబై 'వర్లి'లోని ఓ ఖరీదైన టవర్‌లో 4 బి.హెచ్.కె ఫ్లాట్ ఉంటున్నారు. చాలా విలాసవంతమై బవంతిలో ఉంటున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిసార్ట్‌లో పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లి, అనుష్క జంట సీ ఫేసింగ్ ఉన్న ఈ ఇంట్లో కాపురం పెట్టనుంది.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ.638 కోట్లతో ప్రపంచంలోనే మూడో ధనవంతుడైన క్రికెటర్‌గా ఉన్నాడు. కోహ్లీకి బీసీసీఐ నుంచే కాకుండా వివిధ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తోంది. కోహ్లీకి సొంత ఫ్యాషన్ బ్రాండ్ రాన్, ప్యూమాతో భాగస్వామ్యం ఉంది.


విరాట్ కోహ్లీ విదేశీ పర్యటనల్లో ఉంటే అనుష్క శర్మ మాత్రం ఇంటి బాల్కనీలో ఉన్న మొక్కల పెంపకంలో చాలా బిజీ ఉంటుంది.

కోవిడ్ వ్యాప్తి పెరగడంతో విరాట్ తమ పూర్తి ఫ్యామిలీని తన కొత్త ఇంటికి మార్చేశాడు. సమయం దొరికితే తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగ గడుపుతుంటాడు.