టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ ధోని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. భర్తతో పాటు, కూతురు జీవా చేసే అల్లరి, బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను వీడియో, ఫోటో తీసి అభిమానుల కోసం పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ధోని అభిమానులకు బాగా దగ్గరయ్యారు.