సోదరుడి త్యాగానికి నిజమైన బహుమతి.. 41 ఏళ్ల తరువాత దేశానికి ఒలింపిక్ పతకం అందించిన ఆయనెవరంటే?

|

Nov 11, 2021 | 7:59 AM

Indian Hockey Team: ఈ ఏడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌కు చారిత్రాత్మక పతకాన్ని అందించిన తర్వాత భారత స్టార్ డ్రాగ్-ఫ్లిక్కర్ రూపిందర్ పాల్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

1 / 5
41 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్‌కు ఒలింపిక్ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ డ్రాగ్-ఫ్లిక్కర్ ఈరోజు అంటే నవంబర్ 11న తన 31వ పుట్టినరోజును నిర్వహించుకుంటున్నాడు. భారత్ తరఫున 223 మ్యాచ్‌ల్లో 119 గోల్స్ చేసిన ఈ ఆటగాడు సెప్టెంబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

2 / 5
రూపిందర్ సింగ్ హాకీ ప్రయాణం కూడా ఒక ప్రేరణగా నిలవనుంది. అతను 6 సంవత్సరాల వయస్సులో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని షేర్ షా హాకీ అకాడమీలో శిక్షణ ప్రారంభించాడు. నిరంతరం మెరుగుపడుతూ రూపిందర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 2002లో చండీగఢ్ హాకీ అకాడమీ తరపున ఆడటం ప్రారంభించాడు. అతను 2010 సంవత్సరంలో భారత జట్టులో భాగమయ్యాడు.

3 / 5
2010 సంవత్సరంలో, రూపిందర్ పాల్ సింగ్ ఇపోలో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా కప్‌తో టీమ్ ఇండియాలో అరంగేట్రం చేశాడు. మరుసటి సంవత్సరం అదే టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అప్పటి నుంచి అతను గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్, ఆ సంవత్సరం ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడలు, 2016 ఒలింపిక్ క్రీడలు, ఆ తర్వాత 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

4 / 5
రూపిందర్ పాల్ సింగ్ కుటుంబం హాకీతో అనుబంధం కలిగి ఉంది. ఆయన అన్నయ్య రాష్ట్ర స్థాయిలో ఆడాడు. కుటుంబ బాధ్యతల కారణంగా టీమ్ ఇండియా ప్రయాణం సాగించలేకపోయినా.. తండ్రికి ఆర్థిక సాయం చేసేందుకు ఆటకు స్వస్తి చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రూపిందర్ మాత్రం తన హాకీ కలను నెరవేర్చుకోవాలని కోరుకున్నాడు.

5 / 5
రూపిందర్ కూడా తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఒకప్పుడు తాను రూ. 50లు ఖర్చు పెట్టేందుకు కూడా ఆలోచించే పరిస్థితిలో ఉంది. కానీ నేడు తన కుటుంబంతో కలిసి తన కలలన్నీ నెరవేర్చుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.