1 / 5
కామన్వెల్త్ గేమ్స్ 2022 మూడో రోజున అందరి చూపు భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ పైనే ఉంటుంది. రెండో రోజులాగే మూడో రోజు కూడా వెయిట్ లిఫ్టర్లు భారత్ సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో టేబుల్ టెన్నిస్, హాకీలో కూడా భారత్ బరిలోకి దిగనుంది. జులై 31న వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత జెరెమీ లాల్రిన్నుంగా, అచింత షులి భారత్‌కు పతకాల సంఖ్యను పెంచగలరని భావిస్తున్నారు.