పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడు. గత కొంతకాలంగా అతడి టెక్నిక్ ను మెరుగుపరుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఇతడి ఖాతాలో 2167 పరుగులు 44.22 సగటుతో ఉన్నాయి. రికార్డు బ్రేక్ చేయడానికి ఇతడికి సాధ్యం కావచ్చు.
మార్నస్ లబూషెన్.. టెస్టుల్లో చేసిన పరుగులు తక్కువే అయినా.. ప్రతీ మ్యాచ్ కు తన ప్రతిభను ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. మరో స్టీవ్ స్మిత్ అని అంటున్న ఈ ఆటగాడు ఖచ్చితంగా సచిన్, లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. మోడరన్ ఎరాలో గ్రేట్ బ్యాట్స్ మెన్ గా పిలుస్తుంటారు. 89 మ్యాచ్‌లలో 7463 పరుగులు సాధించిన విరాట్ రికార్డు బ్రేక్ చేయాలంటే.. 43 ఇన్నింగ్స్ లో 2537 పరుగులు చేయాలి.
ప్రస్తుత ప్రపంచ టెస్ట్ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్.. ఇప్పటిదాకా 7115 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇతడు ఫాస్టెస్ట్ పరుగుల రికార్డు బ్రేక్ చేయాలంటే 50 ఇన్నింగ్స్ లో 2,885 పరుగులు చేయాలి.
టెస్టు క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్. 77 మ్యాచ్ లు ఆడిన ఈ ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్.. 27 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో 7540 పరుగులు సాధించాడు. మరో 55 ఇన్నింగ్స్‌లో 2460 పరుగులు చేస్తే అత్యంత ఫాస్టెస్ట్ 10,000 సాధించగలిగిన రికార్డు బ్రేక్ చేయగలడు. అతడికి ఇది పెద్ద అసాధ్యం కాకపోవచ్చు.