Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి! వ్యాపారంలో లాభాలు

Edited By:

Updated on: Nov 28, 2026 | 12:30 PM

వార ఫలాలు (నవంబర్ 29 – డిసెంబర్ 5, 2026): ఈ వారం కొన్ని రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. ఆదాయం, ఆరోగ్యం, వృత్తి, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే మరికొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు కుటుంబ వ్యవహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారానికి సంబంధించిన పూర్తి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

1 / 13
వార ఫలాలు (నవంబర్ 29-డిసెంబర్ 5, 2026): మేష రాశి వారు ఈ వారం ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలపరంగా వారమంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబంలో సుఖసంతోషాలు తగ్గే అవకాశం కూడా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

2 / 13
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): సప్తమ స్థానంలో బుధ, శుక్రులు, పంచమ స్థానంలో రాశ్యధిపతి కుజుడు, గురువు బాగా అను కూలంగా ఉండడం వల్ల ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలపరంగా వారమంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. బంధువుల నుంచి మధ్య మధ్య విమర్శలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగు తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు సానుకూల సమా చారం అందుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

3 / 13
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు షష్ట స్థానంలో స్వక్షేత్రంలో బుధుడితో కలిసి ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగినా, సకాలంలో అన్నిటినీ పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. బంధుమిత్రులు మీ సలహాలతో లబ్ధి పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

4 / 13
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు షష్ట స్థానంలోకి ప్రవేశించినందువల్ల ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబంలో సుఖసంతోషాలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఎక్కడా ఎవరితోనూ వాదోపవాదాలకు, ఆర్థిక లావాదేవీలకు దిగకపోవడం మంచిది. ధైర్యంగా, పట్టుదలగా ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగు లకు డిమాండ్ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబ నమ స్యలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

5 / 13
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ధన స్థానంలో కుజ, గురువుల సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ వ్యవహార జయం, కార్యసిద్ధి కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో కొన్ని అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా అధికారుల నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగా హుషారుగా సాగిపోతాయి.

6 / 13
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశిలో గురు, కుజుల సంచారంతో పాటు, కుజుడితో రాశ్యధిపతి రవి పరివర్తన చెందడం వల్ల ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక పరిస్థితి పరవా లేదనిపిస్తుంది. ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉండదు. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరిగి, అదనపు బాధ్యతల్ని అప్పగిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విద్యార్థు లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో పంతాలు తగ్గించుకోవడం ఉత్తమం. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

7 / 13
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం, ధన స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల  పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసి లాభం పొందుతారు. ప్రతి పనీ సకా లంలో, సంతృప్తికరంగా పూర్తవుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది.  ఉద్యోగంలో అనుకోకుండా మంచి హోదా లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలపరంగా దూసుకుపోతారు. పోటీదార్ల సమస్య నుంచి చాలావరకు బయటపడతారు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

8 / 13
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడితో పాటు బుధ, గురు, కుజ, శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వార మంతా విజయాలు, సాఫల్యాలతో గడిచిపోతుంది. ముఖ్యంగా కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఇంటా బయటా మీ మాటకు తిరుగుండదు. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వృత్తి జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో మంచి పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.

9 / 13
వృ‌శ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ధనాధిపతి గురువుతో కలిసి రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఆదాయపరంగా వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఉద్యోగంలో కొద్దిగా బాధ్యతలు మారే అవకాశంఉంది.  వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్యల్ని తేలికగా అధిగమిస్తారు. ఆటంకాలున్నా ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెడతారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా పురోగమిస్తాయి.

10 / 13
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): లాభ స్థానంలో బుధ, శుక్రులు, భాగ్య స్థానంలో రాశ్యధిపతి గురువు, కుజుడు కలిసి ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ చక్కబడతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్యల్లో ముఖ్య మైనవి పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి.  కొత్త నిర్ణయాలకు, ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. విద్యార్థులు తేలికగా ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

11 / 13
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): దశమ స్థానంలో బుధ, శుక్రులు, లాభ స్థానంలో రవి, తృతీయంలో రాశ్యధిపతి శని సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ధన, కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కొత్త పరిచ యాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

12 / 13
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): దశమ స్థానంలో రవి, భాగ్య స్థానంలో బుధ, శుక్రులు, సప్తమంలో గురు, కుజుల సంచారం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఒత్తిళ్ల నుంచి, సమస్యల నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి ఆశించినంతగా రాబడి పెరుగుతుంది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతాయి.

13 / 13
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో కుజుడితో కలిసి ఉన్నందువల్ల ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. భాగ్య స్థానంలో రవి సంచారం చేయడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలు, కష్టనష్టాల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమైన ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యో గంలో ఇతరులకు సహాయంగా ఉంటారు. ఎవరితోనూ వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ఆరో గ్యానికి ఢోకా ఉండదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు  హ్యాపీగా సాగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us