Weekly Horoscope: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. ఈ వారం ఎవరికి ఎలా ఉంటుంది?

Edited By:

Updated on: Apr 04, 2026 | 3:59 PM

వార ఫలాలు (ఏప్రిల్ 5-11, 2026): ఈ వారం గ్రహాల సంచారం రాశుల వారీగా మిశ్రమ ఫలితాలను అందించనుంది. కొందరికి ఆదాయం, ఉద్యోగంలో పురోగతి, శుభవార్తలు లభిస్తే, మరికొందరు ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించడం, సంబంధాల్లో సమతుల్యత కలిగి ఉండడం అవసరం. ప్రయత్నాలు చేస్తే అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిం చడం చాలా మంచిది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టా ల్సిన అవసరం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ధనపరంగా ఎవరికీ ఎలాంటి వాగ్దా నాలు చేయకపోవడం శ్రేయస్కరం. లాభ స్థానంలో బుధుడు  బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. చిన్నా చితకా ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశినాథుడు శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిత్రుల మీదా, విలాసాల మీదా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఇతరులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన స్థానంలో గురువు, లాభ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలిస్తాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సీదాసాదాగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశినాథుడు బుధుడు భాగ్య, దశమ స్థానాల్లో సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. లాభ స్థానంలో రవి, శుక్రుల సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడం మంచిది. కుటుంబ జీవితంలో మానసిక, శారీరక ఒత్తిడి బాగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య, దశమ స్థానాల్లో గ్రహ సంచారం పెరిగినందువల్ల ఉద్యోగంలోనే కాకుండా, వృత్తి, వ్యాపారాల్లో కూడా యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీత భత్యాల పెరుగుదల, పదోన్నతులతో పాటు, ఉద్యోగరీత్య ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. కుటుంబంలో కూడా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి లోటుండదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు.  ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి అష్టమ స్థానంలో శనితో కలిసి ఉన్నందువల్ల మధ్య మధ్య అనారోగ్య సమస్యలు, ఆదాయ సమస్యలు తప్పకపోవచ్చు. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది.  ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. అధికారులకు నమ్మకం ఎక్కువై, ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ధన పరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరికీ హామీలు కూడా ఉండవద్దు. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.  ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు షష్ట స్థానంలో రాహువుతో కలిసి ఉండడం వల్ల అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు, అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నెల 11వ తేదీ వరకు ఈ రాశివారికి సమయం అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.  ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సప్తమంలో రాశ్యధిపతి శుక్రుడు, భాగ్య స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ వారం జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దోగొప్పో పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.  ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.  నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం కనిపిస్తోంది.

8 / 12
వృ‌శ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల  వారమంతా విజయాలు, సాఫల్యాలతో సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం ఏర్పడి, కొత్త బాధ్య తలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల్ని కొద్ది ప్రయత్నంతో అధిగమిస్తారు. ఆటంకాలున్నా ముఖ్యమైన పనులు, వ్యవహా రాలను పూర్తి చేస్తారు. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెడతారు.  ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలోనూ, రవి, శుక్రులు పంచమ స్థానంలోనూ ఉన్నందువల్ల ఈ వారమంతా ఆర్థిక పరిస్థితి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. విజయాలకు, సాఫల్యాలకు లోటుండదు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రతి పనీ ఆశించిన స్థాయిలో పూర్తవుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. స్థాన చలనానికి  అవకాశం ఉంది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో రవి, కుజులతో కలిసి ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి స్థాయిలో చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్య మైన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రాశ్యధిపతి శని ధన స్థానంలో రవి, కుజులతో సంచారం సంచారం చేస్తున్నందువల్ల అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా మాట తొందరపాటు వల్ల కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల నుంచి, సమస్యల నుంచి ఉపశమనం, ఊరట లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగుతాయి.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో, శుక్ర, రవులు ధన స్థానంలో ఉన్నందువల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.  ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

Follow Us