Weekly Horoscope: ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశికి వారఫలాలు ఇలా..

Edited By:

Updated on: Jun 06, 2026 | 6:02 PM

వార ఫలాలు (జూన్ 7-13, 2026): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. వృషభ రాశి వారికి ఈ రాశివారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. మిథున రాశి వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల దాదాపు అన్ని రంగాల వారు శుభ ఫలితాలు పొందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, కుజ, శుక్రుల బలం వల్ల ఈ వారం ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.  దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తల పెట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు అందుతాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశివారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల దాదాపు అన్ని రంగాల వారు శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పూర్తి చేయడంలో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. పోటీదార్ల మీద విజయాలు సాధిస్తారు. సమాజంలో పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందు తారు.  విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. షేర్లు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూల ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఆదాయానికి లోటుండదు. తలపెట్టిన ప్రతి పనీ నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతల్ని పూర్తి చేస్తారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరి చయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఆఫర్లు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశివారికి ఈ వారం చాలావరకు బాగా అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉచిత సహాయాలు, దానధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారపరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. పిల్లల చదువులు, ఉద్యోగాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగువేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పెద్దల సలహాలు కూడా తీసుకోవలసిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక రుణాల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొన్ని శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గురు బలం వల్ల ఈ రాశివారికి ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొద్ది శ్రమతో ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యం జరిగే సూచనలున్నాయి. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసు కోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తిగా బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. షేర్లు బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ వారం ఆదాయ వ్యయాలు సమానంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా గడిచిపోతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. ఆర్థిక విషయాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఒక పట్టాన చేతిలో డబ్బు నిలవదు. వారాంతంలో మొండిబాకీలు వసూలవుతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద శ్రమ పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చాలావరకు సానుకూల పడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. బంధువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. నిరుద్యో గులకు సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. సేవలపరంగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాలే కాక ఉద్యోగాలు కూడా బాగా ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదర వర్గంతో ఆస్తికి సంబంధించి రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువులకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

Follow Us