
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, సౌందర్యం, ప్రేమ, విలాసం, కళలు, భౌతిక సుఖాలకు కారక గ్రహంగా భావిస్తారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఐశ్వర్యం, ఆనందం, సౌకర్యాలు పెరుగుతాయని నమ్మకం. 2026 జూన్ 8న శుక్రుడు మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశి మార్పు కొన్ని రాశుల వారికి విశేషమైన శుభఫలితాలను అందించనుంది. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వైవాహిక జీవితాల్లో అనుకూల పరిణామాలు కనిపించే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: వ్యక్తిత్వం, ఆదాయంలో మెరుగుదల.. శుక్రుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ కాలం వీరికి ఎంతో అనుకూలంగా మారుతుంది. వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరిగి, ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తాయి. దాంపత్య జీవితంలో సఖ్యత పెరిగి, అవివాహితులకు వివాహ యోగాలు బలపడతాయి. ఉద్యోగ రంగంలో పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

కన్యా రాశి: లాభాల వర్షం కురిసే సమయం.. శుక్రుడు లాభ స్థానమైన 11వ ఇంట్లో సంచరించడం వల్ల కన్యా రాశి వారికి ఇది అత్యంత శుభప్రదమైన కాలంగా మారవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల ద్వారా మంచి రాబడులు పొందవచ్చు. నిలిచిపోయిన బాకీలు లేదా రావలసిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులు, సహచరుల సహకారం పెరుగుతుంది. సామాజికంగా గౌరవం, గుర్తింపు కూడా పెరిగే అవకాశం ఉంది.

తులా రాశి: కెరీర్‌లో భారీ పురోగతి.. తులా రాశి అధిపతి అయిన శుక్రుడు కర్మస్థానమైన 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వృత్తి జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెంపు లేదా కీలక బాధ్యతలు దక్కవచ్చు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త క్లయింట్లు, కొత్త ఒప్పందాలు లభించి వ్యాపార విస్తరణకు దారితీయవచ్చు. విదేశీ అవకాశాలు కూడా కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మకర రాశి: సంబంధాలు, భాగస్వామ్యాల్లో శుభఫలితాలు.. శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల మకర రాశి వారికి దాంపత్య, భాగస్వామ్య సంబంధిత అంశాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే వివాహితులైన వారికి దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది. గతంలో ఉన్న విభేదాలు తొలగిపోయి పరస్పర అవగాహన బలపడుతుంది. వ్యాపార భాగస్వామ్యాల్లో కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయంగా మారే అవకాశం ఉంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)