ధనలక్ష్మి తాండవమే..ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంట కుప్పలు కుప్పలుగా డబ్బే డబ్బు!

Updated on: Jun 27, 2026 | 8:38 AM

వాస్తు శాస్త్రంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి ప్రతి కూల శక్తిని తరిమి కొట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది అంటారు. అందువలన ఉప్పుతో ఏ పరిహారం చేసినా అది మంచి ఫలితాలను ఇస్తుందంట. ముఖ్యంగా ఉప్పు డబ్బాలో ఇవి పెట్టడం వలన ఇంటిలో ధనలక్ష్మి తాండవం చేయడమే కాకుండా, కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి చేరుతుందంట. కాగా, ఈ పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉప్పు ప్రతి కూల శక్తిని తరిమికొట్టి, సానుకూలతను పెంచేదే కాకుండా, లక్ష్మీదేవికి సంబంధించినదిగా చెబుతుంటారు. అందుకే ఉప్పు విషయంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఉప్పు డబ్బ తీసుకొని అందులో ఈ ఐదింటిని ఉంచడం వలన అప్పుల బాధలు తొలిగిపోతాయంట.

2 / 5
ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలు, జీవితంలో గందరగోళం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు తప్పకుండా ఈ వాస్తు చిట్కాలు పాటించాలంట. ముఖ్యంగా ఎంత సంపాదించినా ఇంటిలో రూపాయి కూడా మిగలని వారు, ఉప్పు డబ్బా తీసుకొని అందులో ఐదు లవంగాలు వేసి పెట్టాలంట. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

3 / 5
వాస్తు ప్రకారం, ఉప్పు చంద్రుడు, రాహువు, కేతువులతో దగ్గరి సంబంధం ఉంటుంది. అంతే కాకుండా ఉప్పు, లవంగానికి లక్ష్మీదేవితో కూడా సంబంధం ఉంటుంది. అందువలన వాస్తు ప్రకారం, ఉప్పు డబ్బాలో ఐదు లవంగాలు పెట్టడం వలన ఇది ప్రతి కూల శక్తిని తరిమి కొట్టి, ఇంటిలో సానుకూల శక్తి పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా కలిసి వచ్చేలా చేస్తుంది. అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తుంది.

4 / 5
అందువలన శుక్ర వారం లేదా శని వారం రోజున ఒక గాజు సీసా తీసుకొని దాని నిండా ఉప్పు వేసి, అందులో ఐదు లవంగాలను మొగ్గలను పైకి పెట్టి పెట్టి ఉంచాలి. ఇది సానుకూలతను పెంపొందిస్తుంది. ఇక ఈ ఉప్పును వంటల్లో వాడుకున్నా ఎలాంటి ప్రమాదం ఉండదు. వారం లేదా రెండు వారాలకు ఒకసారి లవంగాలను మార్చుతూ ఉండాలి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us