అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?

Updated on: Oct 17, 2026 | 6:15 AM

ఆడపడుచులకు చాలా ఇష్టమైన సద్దుల బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది. అక్టోబర్ 18 ఆది వారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో 7 రోజులకే సెలబ్రేషన్స్ పూర్తి అయితే మరికొన్ని ప్రదేశాల్లో 13 రోజుల వరకు కూడా కొనసాగుతాయి. కానీ చాలా ప్రాంతాల్లో మాత్రం అక్టోబర్ 18తో బతుకమ్మ సంబురాలు ముగుస్తాయి.

1 / 5
ఇక బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ, ప్రకృతి పండుగ. అయితే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి, పూజ చేసిన తర్వాత రంగు రంగు పూలను తీసుకొచ్చి అందమైన బతుకమ్మను పేర్చుతారు. అయితే చాలా మందికి బతుకమ్మను పేర్చడం తెలియదు. ముందుగా ఏ పూలను పెట్టాలి. ఎలా పేర్చాలో అంతగా తెలియదు. కాగా, మనం ఇప్పుడు  అసలు బతుకమ్మను పేర్చడం ఎలాగో చూసేద్దాం పదండి.

2 / 5
తెలంగాణ ఆడపడుచులకు ఆత్మగౌరవానికి ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో బతుకమ్మను పేర్చుతారు. అయితే ఇలా బతుకమ్మను పేర్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందంట. కాగా దాని గురించి తెలుసుకుందాం.

3 / 5
బతుకమ్మను పేర్చడానికి మొదటగా , ఒక రాగి ప్లేట్ తీసుకోవాలి. అందులో గుమ్మడి ఆకులు వేసి చక్కగా పర్చాలి. చుట్టూ ఎక్కువగా ఉండకుండా కట్ చేసుకోవాలి. తర్వాత ఆకులపైన పసుపు,కుంకుమ వేసుకోవాలి. దీని తర్వాత అడవి తంగేడు పూలను పెట్టాలి. ఇది బతుకమ్మకు బేస్ ఇస్తుంది.

4 / 5
 అంతే కాకుండా చివరన తంగేడు పువ్వు పెట్టడం వలన బతుకమ్మ కూడా కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. దీని తర్వాత గునుగు పూలను కట్టలుగా కట్టి పేర్చుకోవాలి. దీని వలన బతుకమ్మ మంచిగా వస్తుంది. తర్వాత సీతమ్మ పువ్వును కూడా కట్టలుగా కట్టి పేర్చొచ్చు లేదంట నార్మల్‌గా అయినా బతుకమ్మను సులభంగా పేర్చుకుంటూ వెళ్లాలి.

5 / 5
ఇలా మీ దగ్గర ఉన్న పువ్వులతో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరసలుగా మీకు నచ్చిన వరసల క్రమంలో పేర్చుకుంటూ వెళ్లాలి. దాదాపు తొమ్మది,16 వరసల వరకు బతుకమ్మను పేర్చుకుంటారు.  ఇక చివరగా బతుకమ్మ ఒక గోపురం ఆకారంలో వస్తుంది. అప్పుడు గోరింట పువ్వులు, మందారం, పువ్వులు పెడుతుంటారు. ముఖ్యంగా ముందుగా గుమ్మడి పువ్వులు పెడతారు.

Loading...
Unable to load recommendations.
Follow Us